Thursday 21 November 2013

c.k.naidu

కనకయ్య నాయుడు 1923లో సైన్యంలో పనిచేసారు.
బ్రిటీష్ జట్టుతో ఆడేప్పుడు స్కోరును పరుగులెత్తించడం ఈయనకు చాలా ఇష్టం.
క్రికెటర్లు ప్రకటనలలో కనపడటం కూడా, ఆ రోజుల్లో సి.కే, ఒక టీ వ్యాపార ప్రకటనలో కనిపించటంతో మొదలు అయ్యింది.
తొలి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా “పద్మబూషణ్” బిరుదు అందుకున్నారు. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు.
ఆరు దశాబ్దాలపాటు “ఫస్ట్ క్లాస్ క్రికెట్” ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి.కె.నాయుడు ఒకరు.
జట్టును ముందుంచి నడిపించడంలో దిట్ట.
ప్రముఖ క్రికెట్ ఆటగాడు ముష్తాక్ అలి సి కె ని “షహెన్షా” (రాజాధి-రాజు) గా వర్ణించాడు. సి జి మెకార్ట్ని, సి కె ఓ అద్బుత, పరాక్రమ, అగ్రగామి బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. జే బి హోబ్స్ సి కె పుట్టుకతోనే గొప్ప ఆటగాడు అని పేర్కొన్నారు.
ఈ మేటి క్రికెటర్ పేరున సి కె నాయుడు క్రికెట్ టోర్నమెంట్ యేటా నిర్వహిస్తున్నారు.
ప్రతిష్టాత్మక సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు నెలకొల్పి, ఐదు లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో మన్సూర్ అలి ఖాన్ పటౌడి, నింబాల్కర్, చందూ బొర్డే, భగవత్ చంద్రశేఖర్, వెంకటరాఘవన్, బిషన్ సింగ్ బేడి, ఎరపల్లి ప్రసన్న వంటి మేటి ఆటగాళ్ళు ఉన్నారు.
క్రికెట్ చరిత్రలో మొదటి మహిళా కామెంటేటర్ చంద్ర సి.కె.నాయుడు, కెప్టెన్ సి.కె.నాయుడు పుత్రిక కావటం భారతదేశం గర్వించదగ్గ అంశం.


సి.కె.నాయుడు పూర్వీకులు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందినవారు. అయితే, ఆయన తాతగారైన నారాయణస్వామినాయుడు గారికి రెండు తరాలకి ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాదుకి తరలిపోయింది. నారాయణస్వామి తాతగారు నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్ కు మారింది. చివరికి సి.కె.నాయుడి తండ్రి సూర్యప్రకాశరావు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ, నాగపూరు లో స్థిరపడ్డారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. సి.కె.ప్రతిభను గౌరవిస్తూ, హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనకి తన సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి, ఇండోర్ రావలసిందిగా ఆహ్వానించాడు. తన ఆఖరు రోజుల వరకూ సి.కె. అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో రాసారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడి గారి కుటుంబంలో కొనసాగాయి. సి.కె.మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీథికి సి.కె. పేరు పెట్టారు. సి.కె.నాయుడు సోదరుడు సి.ఎస్.నాయుడు కూడా ప్రముఖ క్రికెటర్. సి.కె. కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్.







No comments:

Post a Comment