కాపు , బలిజ , తెలగ , ఒంటరి, నాయుడు కులాలు కాపు అనే ఒకే కులం కుదురుకు చెందినవారు. రెడ్డి, నాయుడు, శెట్టి, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుధములు. నేటి రెడ్లు కూడా తమ కులం కాపు గా పేర్కొంటారు. ఇప్పుడిప్పుడు తూర్పుకాపులు మున్నూరు కాపు లు వీరితో వియ్యమందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 22 శాతం నుండి 24శాతం వరకు ఈ కులస్తులు కలరు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, కేరళ, పాండిచ్చేరి రాష్టాలలో గణనీయంగా ఉన్నారు. కాపుల్నివెనుకబడిన కులాల్లో చేర్చాలనివీరు ఉద్యమాలు చేస్తున్నారు కానీ మిగతా వెనుకబడిన కులాల వాళ్ళు మేము మీకంటే వెనుకబడి ఉన్నామని అభ్యంతరం చెబుతున్నారు. అందువలన రిజర్వేషన్ సమశ్యను తాకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కులస్తులకు కూడా బీ.సీ. ల లాగానే స్కాలర్షిప్పులు మంజూరు చేసింది. కోస్తా జిల్లాలలో వీరిని తెలగ కాపు అని, రాయలసీమలో వీరిని బలిజ అని, తెలంగాణ మున్నూరుకాపులు అని వ్యవహరిస్తారు.
No comments:
Post a Comment