Thursday, 21 November 2013

kapu itihasam

చంద్ర వంశ బలిజ క్షత్రియులు

బలిజ వంశోత్పత్తి వివిరణము.
భాగవతము, నవమస్కంధము ౨౩ వ అధ్యాయము
శ్రీ శుక వువాచ.
"అనో: సభానరస్చక్షు: పరోక్షశ్చత్రయ స్సుతా:,
సభానరాత్ కాలనరః సృన్జయంత త్సుతస్తత:.
జనమేజయ స్తస్యపుత్రో మహాశీలో మహామనాః,
ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ.
శిబిర్వన స్సమిర్దక్షశ్చత్వారోశీనరాత్మజాః,
వృషాదర్భః సువీరశ్చ మద్ర: కైకయ ఆత్మజాః.
శిబే శ్చత్వార ఏవా సం స్తితిక్షోశ్చ రుసద్ర థః,
తతో హేమో థసుతపా బలి: సుతపసో భవత్.
అంగ వంగ కళింగాద్యాః సింహపున్ద్రాంధ్ర సంజ్నితా:,
జజ్ఞి రే దీర్ఘ తమసో బలే: క్షేత్రే మహీక్షిత:.
చక్రు: స్వనామ్నా విషయాన్ శడిమాన్ ప్రాచ్యకాంశ్చ తే."

తాత్పర్యం: యయాతి మహారాజునకు కొడుకైన అనువునకు సభానరుడు, చక్షుస్సు, పరోక్షుడు అను మువ్వురు పుట్టిరి. సభానరునికి కాలనరుడును, కాలనరునకు సృంజయుండును, సృన్జయునకు పురంజయుడును, పురంజయునకు జనమేజయుడును, జనమేజయునకు మహాశీలుమ్డును, మహాసీలునకు మహా మనస్సును పుట్టిరి. మహా మనస్సునకు ఉసీనరుడు, తితిక్షువు అని యిర్వురు కొడుకులు పుట్టిరి. ఉసీరునకు శిబి, వన, శమి, దక్షుడు అని నల్వురు పుట్టిరి. శిబికి వృషాదర్భ, సువీర, మద్ర, కేకయ అని నల్వురు కలరు. తితిక్షువునకు రుశద్రదుడును, వానికి హేముడును, వానికి సుతపుడును, వానికి బలి యును పుట్టిరి. బలి యొక్క క్షేత్రమునందు దీర్ఘతముడను ఋషి వలన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్ర, అను వారార్గురు జన్మించి, ఈ భూమిని భాగించుకుని వారి వారి దేశములకు వారి వారి పేరుల నుంచిరి.
అది మొదలు అంగాది దేశములు ఆరు అయ్యెను.

సుతపుడను మహారాజునకు బహుకాలము సంతానము లేనందున అనేకములైన బలులను, యాగాములను చేయగా నొక్క కుమారుడు బలి కల్గెను. ఆ బలివలన పుట్టినవారైన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్రులు అనువారు బలిజవారైరి. అనగా, బలి: = బలియను వానికి, జ: = పుట్టినవారు అని వ్యుత్పత్తి.

బలి కొమరుడైన ఆంధ్రుడు మగధ దేశమునకు రాజైనాడు. వీని వంశీయులు మహా పరాక్రమ శాలురై ౪౬౦ సంవత్సరములు హిమాచలము ఉజ్జయిని వంగ దేశము ఆనెగొంది..... ఈ సరిహద్దులలో గల దేశమును పాలించియుండిరి.
బలిజ అనగా బలి అంటే యజ్ఞం అని, జ అనగా జన్మించిన వారని అర్థం.

"బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి
ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
కలిమి బలములకెల్ల ఘన పుణ్య రాశి
కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
అయ్యావళి ముఖ్యమైనట్టి వారు
కయ్యమందున కాలు కదిలించ బోరు
నేయ్యమందు మహా నేర్పు గల వారు
దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు"

"తెలివినేబదియారు దేశాదిపతులుగా
నిలుచుట బలిజ సింహాసనంబు,
శరణాగతత్రాణ సద్బిరుదుభాసిల్లె
......... బలిజ సింహాసనంబు,
మర్యాదమల్లని మాడ్కిని ధర్మంబు
న్యాయంబు బలిజ సింహాసనంబు,
త్యాగభోగంబుల దానకర్ణుని మించె
నభివృద్ధి బలిజ సింహాసనంబు,
మాళ వాంధ్ర మగధ కురూ లాట
........... ప్రభులు బలులు
అద్భుతంబైన బలిజ సింహాసనంబు."

కాపు

"సమర సమయములందు పితురుల
క్షాత్ర తెజములన్ నిలువబెట్టువాండు కాపు
శాంతి దినములన్ సేద్యమున్ దే
శమున్ గాపాడువాండు కాపు”

"కాపు వల్లనే కదా ! కరణీక ప్రజ్ఞలు ఆదాయ వ్యయములు వ్రాయగలిగె,
కాపు వల్లనే కదా ! ఘనమైన రాజులు చేకొని రాజ్యంబు చేయగలిగె,
కాపు వల్లనే కదా ! గ్రామ ఘాన సేయు నెరవుగా ధాత్రిని నిలువ గలిగె,
కాపు వల్లనే కదా ! కవిభట కోట్లెల్ల బహు భోగముల చేత బ్రతుక గలిగె,
కాపు హెచ్చైన మీసరగండ బిరుదు విజయ విఖ్యాతి గొనె చాల వేద్కలలరి
కాపు దేవుడు దేవుడు కలియుగమున !!"

*గుబ్బలగుమ్మ లే జిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్
గబ్బి మిటారి చూపులది కాపు ది దానికి నేల యొక్కనిన్
బెబ్బులి నంటగట్టితివి పెద్దవు నిన్ననరాదు గాని దా
నబ్బ పయోజగర్భ మగనాలికి నింత విలాస మేటికిన్ -శ్రీనాధుని చాటువు (25)

*పస గల ముద్దు మోవి బిగి వట్రువ గుబ్బలు మందహాసమున్
నొసట విభూతిరేఖయు బునుంగున తావి మిటారి చూపులున్
రసికులు మేలు మేలు బళిరా యని మెచ్చగ రాచవీటిలో
బసిడి సలాక వంటి యొక బల్జె వధూటిని గంటి వేడుకన్ -శ్రీనాధుని చాటువు(4

No comments:

Post a Comment